Friday, December 2, 2016

వ్యాపారుల పాలిట వరం : mVisa

Demonetization (నోట్ల రద్దు ) వలన దేశం మొత్తం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నోట్ల రద్దు మంచిదా చెడ్డదా అనే చర్చ దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. కానీ, ఈ సమయంలో చిన్న వ్యాపారులకు, వినియోగదారులకి మార్గం ఏంటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం మీద, IT మీద పట్టు  వున్నవారు చెయ్యాల్సిన పని.

వ్యాపారులు క్యాషులెస్ అమ్మకాల కోసం చెయ్యాల్సిన నాలుగు చిన్న విషయాలు

కొన్ని వీడియోస్ చూసి మరియూ క్యాషులెస్ విధానాలు తెలుసుకొని, చిన్న వ్యాపారులకు, వినియోగదారుల కోసం తెలుగులో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. 

mVisa ద్వారా అమ్మకం విధానం:
1 . వ్యాపారికి ICICI , Axis or SBI బ్యాంకు లో అకౌంట్ వంటి, mVisa QR కోడ్ కోసం అప్లై చెయ్యండి
2 . బ్యాంకు ఒక unique నెంబర్ మరియు QR కోడ్ కార్డు మీకు పంపిస్తుంది
3 . ఆ కార్డు మీ బిజినెస్ కౌంటర్ పైన ఉంచండి. ఇప్పుడు మీరు కస్టమర్  క్యాషులెస్ అమ్మకాలు మొదలెట్టచ్చు  
4 . కస్టమర్ కు అమ్మిన తరువాత మీ QR కోడ్ కస్టమర్ ను స్కాన్ చెయ్యమని అడగండి
5 . QR కోడ్ స్కాన్  అయ్యిన తరువాత, బిల్ అమౌంట్ ఎంటర్ చేసి "పే" బటన్ నొక్కితే , డబ్బు మీ ఖాతా చేరుతుంది.  మీకు అప్పుడే, డబ్బు అందినట్టు మెసేజ్ వస్తుంది

mVisa రిజిస్ట్రేషన్ వీడియోస్ : http://www.visa.co.in/personal/mvisa/consumers.shtml
నోట్: కస్టమర్ కు మొబైల్ డేటా కనెక్షన్ మరియు ఐసీఐసీఐ, Axis లేదా SBI బ్యాంకు అకౌంట్ ఉండవలెను.